ముకుంద లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఎంట్రీ ఇచ్చి కంచెలో తన నటనతో ఓ మెట్టు ఎదిగాడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. తాజాగా లోఫర్ నిరాశపరిచినప్పటికీ రెట్టించిన ఉత్సాహంతో వచ్చే యేడు వరుస సినిమాలు చేసేందుకు సిద్ధమైపోతున్నాడు. 'కంచె' దర్శకుడు క్రిష్ తోనే మరో సినిమాకి రెడీ అవుతున్నాడు. దీనికి సంబంధించిన స్క్రిప్టు కూడా రెడీ అయింది. 'రాయబారి' పేరుతో రూపొందే ఈ సినిమాలో వరుణ్ భారత ప్రభుత్వం తరఫున పనిచేసే గూఢచారిగా నటించనున్నాడట. కొత్త సంవత్సరంలో ముందుగా ఈ చిత్రమే మొదలు పెడతాడుట. ఇక ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందే చిత్రాన్ని చేస్తాడు. ఆపై వెంకీ అట్లూరి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించే 'ఫీల్ మై లవ్' సినిమాలో కూడా నటిస్తాడు. అలాగే, మరి కొన్ని చిత్రాలు కథలను వినే పనిలో ఉన్నాడట. మొత్తానికి రిలీజ్ ల సంగతి పక్కన బెట్టి వచ్చే సంవత్సరంలో వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసుకునేందుకు సిధ్ధమైపోతున్నాడీ టవర్ స్టార్ తనయుడు.