ఇది రీల్ లైఫ్ కాదండీ... రియల్ లైఫ్ లోనట.. కాజల్ అగర్వాల్ కు చెప్పలేని కోపం వచ్చేసింది. అభిమానులపై గట్టి గట్టిగా అరిచేసిందట. సినిమా వాళ్ళంతా అభిమానులు తమకు దేవుళ్ళనే చెపుతారు. మరీ ఇబ్బంది పెడితే ఎవరు మాత్రం భరించగలరు చెప్పండి. ఆమెకు కోపం రావడానికి గల కారణం ఏమిటంటే... అభిమానులు కదలనీకుండా ఇబ్బంది పెట్టడమే... అందుకే కాబోలు ఈ మధ్యకాలంలో హీరోయిన్లు ఆడియో ఫంక్షన్లకు రావడం మానుకున్నారు. కారణం ఏంటన్నది ఒక్కరూ నోరు విప్పి చెప్పకపోయినా... కాజల్ కు జరిగిన అనుభవాన్ని బట్టి ఇదే కావచ్చు అనుకుంటున్నారు. తమిళ సినిమా ‘పాయుమ్ పులి' మూవీ ఆడియో రిలీజ్ సందర్భంగా ఆమెను ఫ్యాన్స్ చుట్టు ముట్టేశారట. ఒకవిధంగా చెప్పాలంటే ఈ అమ్ముడు అక్కడి నుంచి ముందుకు అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. కొద్దిసేపు ఒపిక పట్టిన కాజల్, చివరకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి అడుగులేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సన్నివేశాల్ని ఒకరు షూట్ చేసి యూ ట్యూబ్లో అప్లోడ్ చేశాడు. ఈ వీడియోని తిలకించిన వీడియోపై కామెంట్లు కూడా చేస్తున్నారు. ఏమైనా సెలబ్రిటీల ఇబ్బందులు కూడా సామాన్య జనం దృష్టిలో పెట్టుకోవాలి మరి.