ఊపిరి విషయంలో నాగ్ కి పెద్దదెబ్బే

March 15, 2016 | 11:38 AM | 3 Views
ప్రింట్ కామెంట్
nagarjuna-oopiri-business-niharonline

ఈ యేడాదిలో ఇప్పటిదాకా వచ్చిన సినిమాల్లో అసలు సిసలైన హిట్ నాగార్జునదే. సుమారు 20 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం దాదాపు 50 కోట్లకుపైగానే కొల్లగొట్టి నాగ్ ముప్పై ఏళ్ల కెరీర్ లో మరిచిపోలేని సక్సెస్ ను అందించింది. సీనియర్లలో ఈ ఫీట్ ను సాధించిన ఏకైక హీరో కూడా నాగే కావటం విశేషం. మొత్తానికి 56 ఏళ్ల వయసులో కూడా వైవిధ్యభరితమైన చిత్రాలతో కెరీర్ ను సాగీస్తున్నాడు. అన్నట్లు తదుపరి చిత్రం ఊపిరి కూడా ఓ డిఫరెంట్ సినిమానే. వీల్ ఛైర్ కి పరిమితమయ్యే పాత్రలో కేవలం నటనకు మాత్రమే స్కోప్ ఉన్న పాత్రలో ఇరగదీస్తాడనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఊపిరి విషయంలో నాగ్ ఇప్పుడు అసంతృప్తితో ఉన్నాడని సమాచారం.

                                 ఈ సినిమా బిజినెస్ పరంగా నాగార్జునకి కాస్తంత అసహనాన్ని కలిగిస్తోందట. సోగ్గాడే చిన్నినాయన భారీగా లాభాలు తెచ్చిపెట్టడంతో 'ఊపిరి'పై అంచనాలు భారీగానే పెరిగాయి. దీంతో పీవీపీ వాళ్లు 'సోగ్గాడు' సక్సెస్ ను చూపించి, డిస్ట్రిబ్యూటర్లకి ఎక్కువ రేటు చెబుతున్నారట. దాదాపు 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఊపిరి పై భారీ స్థాయిలో బిజినెస్ జరిగితేనే తప్ప పెట్టిన పెట్టుబడి రికవరీ కాదు. దీంతో డిస్ట్రిబ్యూటర్లకి భారీ రేటు చెప్పటం, వారు రేటుకి తీసుకోవడానికి జంకుతున్నారని తెలుస్తోంది. ఒకవేళ తెగించి ఎవరైనా ముందుకు వచ్చినా అది నాగ్ పై ప్రభావం చూపిస్తుంది.  ఎక్కడ తేడా వచ్చినా ఆ ప్రభావం తన తదుపరి సినిమాపై పడుతుందనే నాగ్ ఆలోచనలో పడ్డాడంట. గతంలో ఢమరుకం, ఆటోనగర్ సూర్య, లేటెస్ట్ గా అఖిల్ విషయంలో డిస్ట్రిబ్యూటర్ల నుంచి నాగ్ సమస్యలు ఎదుర్కున్నాడు. దీంతో ఊపిరి విషయంలో కాన్ఫిడెన్స్ గా ఉన్నప్పటికీ ఎందుకైనా మంచిదని పీవీపీతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ