కాజల్ కొత్త దుకాణంతో ఇబ్బందే!

February 25, 2016 | 05:52 PM | 1 Views
ప్రింట్ కామెంట్
kajal-agarwal-jwellery-business-with-nisha-agarwal-niharonline

ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లయినా చరిష్మా తగ్గకుండా వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది చందమామ కాజల్. ప్రస్తుతానికైతే అవకాశాలు తగ్గుముఖం పట్టాయి గానీ, ఒకానోక టైంలో టాలీవుడ్, కోలీవుడ్ లో ఆమె నెంబర్ వన్ గా కొనసాగింది. అయితే అవకాశాలు తగ్గినా సరే బడాస్టార్లతో అవకాశాలతో దూసుకెళ్లింది. ఇక ఇప్పుడు ఆమె తెరిచిన కొత్త దుకాణంతో సినీ కెరీర్ కు ముగింపు పలకబోతుందని వార్తలు వినవస్తున్నాయి.

అవును ప్రస్తుతం అందివస్తున్న సినిమా ఆఫర్లను పక్కనబెట్టి బిజినెస్ లోకి దిగిందట. చెల్లెలు నటి అయిన నిషా అగర్వాల్ తో కలిసి జ్యువెల్లరీ బిజినెస్ లోకి అడుగుపెట్టిందని తెలుస్తోంది. మర్సాలా జ్యువెల్లరీ అనే పేరుతో ఇది రన్ అవుతుందట. ఇక ఈ వ్యాపారం చూసుకునేందుకు కాజల్ ఓ పెద్ద ఆఫర్ ను సైతం తిరస్కరించినట్లు తెలుస్తోంది.

                     ఓ బడా హీరోతో నటించాల్సిందిగా ప్రొడ్యూసర్ ఒకాయన ఆమెను అప్రోచ్ అయితే సున్నితంగా తిరస్కరించిందట. ఆ హీరో ఎవరో, నిర్మాత ఎవరో వివరాలు బయటికి రానీవ్వలేదు. ప్రస్తుతానికైతే బ్రహోత్సవంలో నటిస్తున్న కాజల్ ఆ తర్వాత ఒకటి, రెండు చిత్రాల్లో నటించి నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పి, బిజినెస్ లోనే ఉండిపోతుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అంటే పెళ్లికి ఆమె సిద్ధమైపోతున్నట్లేనని సంకేతాలు అందుతున్నాయి. అదే జరిగితే చందమామ మాయమయిపోతుందేమోనని ఫ్యాన్స్ బాగా బెంగపెట్టుకుంటారు.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ