దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుందో ఏమో తన రెమ్యునరేషన్ ను ఇష్టం వచ్చినట్టు పెంచేస్తోంది కాజల్ అగర్వాల్. ఆమె కాల్షీట్ల కోసం వెళ్ళే నిర్మాతలు భయపడి చస్తున్నారని టాలీవుడ్ సినీ వర్గంలో లేటెస్ట్ టాపిక్. ఈ అమ్మడి ఆశకు అంతులేకుండా పోతోందనుకుంటున్నారు. టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడానికి కారణం కూడా ఇదే అనుకుంటున్నారు. తమిళ చిత్రం ’జిల్లా‘ లొ కాజల్ హీరోయిన్‌గా నటించింది. ఆ తరువాత ఇక్కడకూడా అవకాశాలు సన్నగిల్లాయి. లేటెస్ట్ గా తనకు బాలాజి మోహన్ దర్శకత్వంలో ధనుష్‌తో సరసన నటించే అవకాశం వచ్చింది. ఈ చిత్రం షూటింగ్ జరుగుతుండగానే ఆమెకు విశాల్ తో నటించే మరో అద్రుష్టం దక్కింది. ప్రస్తుతం విశాల్ హన్సికతో చేస్తున్న చిత్రం చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం జనవరిలో విడుదల కాబోతోంది. ఆయన తరువాతి చిత్రం సుశీంద్రన్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. పాండియనాడు చిత్రం తరువాత వీరిరువురు కలిసి చేస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో మొదట లక్ష్మీమీనన్ ను అను కున్నారు. కానీ ఇప్పుడు కాజల్ పేరు వినిపిస్తోంది. అయితే నటుడు విశాల్‌కు తమిళంతోపాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉండడంతో ఈ చిత్రాన్ని ద్విభాషల్లో నిర్మించాలని చిత్ర నిర్మాణ సంస్థ వేందన్ మూవీస్ నిర్ణయించుకుంది. దీంతో ఇది ద్విభాషా చిత్రం కాబట్టి తన పారితోషికాన్ని తమిళ వెర్షన్‌కు కోటిన్నర, తెలుగు వెర్షన్‌కు మరో కోటిన్నర మొత్తం మూడు కోట్లు ఇవ్వాలంటూ కాజల్ అగర్వాల్ డిమాండ్ చేసినట్టు సమాచారం. దీంతో నిర్మాత సాధ్యపడదని చెప్పేశాడనే టాక్ వినిపిస్తోంది. ఇంతకూ కాజల్ డిమాండ్ చేసిన మూడు కోట్లు ఇస్తారా లేక ఆమె స్థానంలో మరెవరినైనా తీసుకుంటారా అనేది ఇంకా తేలాల్సి ఉంది. మొత్తానికి కాజల్ మరీ ఇంత కమర్షియలా అనుకుంటున్నారంతా. ఆమె వ్యవహారమేమో అందినకాడికి దండుకుందామన్నట్టుంది.