గిఫ్ట్ తో కాజల్ ను పడగొట్టేశాడు

December 02, 2014 | 11:42 AM | 50 Views
ప్రింట్ కామెంట్

ఎవరు? ఎలా అనేగా? తమిళ నటుడు ధనుష్, కాజల్ కు నచ్చిన గిఫ్ట్ ప్రజెంట్ చేసి. ఇప్పడా గిఫ్ట్ చూసుకుని కాజల్ ఇప్పుడు తెగ మురిసిపోతోంది. నా అభిరుచికి తగ్గ కానుక అంటోంది. ప్రస్తుతం వీరిద్దరూ కలసి ఓ సినిమాలో జంటగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగు సమయంలో ఆమెకు ధనుష్ ఓ గిఫ్ట్ ప్యాక్ ఇచ్చాడట. తెరచి చూసేసరికి కాన్ ఇగుల్డన్ రాసిన బెస్ట్ సెల్లింగ్ నవలలు ఐదు వున్నాయట. అవి చూసి నా ఆనందానికి అవధుల్లేకుండా పోయిందని చెబుతోంది కాజూ. అంతేకాదు "నీ అందమైన కానుకకు థ్యాంక్స్ ధనుష్. వీటిని చూసుకుని నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఒక మంచి పుస్తకం చేతిలో వుంటే అంతకు మించింది మరేమీ వుండదు" అంటూ ధనుష్ కి కృతజ్ఞతలు చెప్పేస్తోంది. ఆ విధంగా కాజల్ ని తన ఫ్యాన్ ని చేసి పారేసుకున్నాడు మన కొలవెర్రి హీరో. మరి దీనికి ఐశ్వర్య ధనుష్ రియాక్షన్ ఏంటో చూడాలి మరి!.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ