హాస్యం కోసమో, ఎంటర్ టైన్మెంట్ కోసమో ప్రేక్షకులను అలరించేలా తీస్తున్న చిత్రాలకు ఈ మధ్య కాలంలో ఎటునుంచి ఏ చిక్కులు ఎదురవుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. కత్తి, లింగ, పీకే.... అన్ని సినిమాలూ ఏదో ఒక రకంగా కోర్టు గడప తొక్కక తప్పడం లేదు. తాజాగా గోపాల గోపాల సినిమా కూడా అదే పరిస్థతిని ఎదుర్కొంటోంది. ‘హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ చిత్రం ఉందంటూ, ఇలాంటి సినిమాలను వెంటనే నిషేదించాలని, వాటి ప్రదర్శనకు అనుమతులు ఇవ్వకూడ’దని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి డిమాండ్ చేసింది. దీనిపై వారు మాట్లాడుతూ...‘పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న గోపాల గోపాల చిత్రం ప్రోమో ఇటీవల టీవీ చానల్స్ లో ప్రసారం అయింది. శ్రీకృష్ణుని వేషధారణతో అసభ్యంగా నాట్యాలు చేస్తూ, వినోదం కోసం దేవుళ్ల వేషధారణ వేయడంపై ఈ రోజు సెన్సార్ బోర్డు రీజనల్ ఆఫీసర్ విజయ్ కుమార్ రెడ్డి గారికి ఫిర్యాదు చేసాం. ఈ చిత్రం విడుదలకు అనుమతి ఇవ్వకూడదని, ఈ చిత్రం ప్రివ్యూ కూడా వెంటనే నిషేదించాలని డిమాండ్ చేస్తూ లిఖిత పూర్వకమైన ఫిర్యాదు చేశామ’ని తెలిపారు. వెంట క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి పోలీసు కమీషనర్ కు ఫిర్యాదు చేస్తాననిహామీ ఇచ్చినట్టు ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి భగవంతరావు, కార్యదర్శి రావినూతల శశిధర్ ప్రకటనలో తెలిపారు.