ఓ షాపింగ్ మాల్ నిర్వాహకులపై కాజల్ కస్సు మంటోంది. తన అనుమతి లేకుండా తన పేరు వాడుకున్న వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభోత్సవం జరుపుకున్న ఓ షాపింగ్ మాల్ అంతకన్నా ముందుగా సిటీలో కాజల్‌ని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా చూపిస్తున్నట్లు వున్న హోర్డింగుల్ని ఏర్పాటు చేసిందట. కానీ తీరా లాంచింగ్ సమయంలో మరో హీరోయిన్ చేత ఓపెనింగ్ చేయించడంతో కాజల్‌కి చిర్రెత్తుకొచ్చినట్లు ఆమె సన్నిహితులు చెపుతున్నారు. దీంతో తనకి తెలీకుండా తన పేరు వాడుకుని తనని లాంచింగ్‌కి పిలవకుండా మరో హీరోయిన్ చేత ఓపెనింగ్ చేయించారని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కాజల్ సిద్ధమైంది. వారి నుంచి నష్టపరిహారం వసూలు చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ షాపింగ్ మాల్ యజమానులు కూడా కాజల్ కు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. లాంచింగ్‌కి వస్తానని చెప్పి చివరి సమయంలో హ్యాండ్ ఇచ్చిందంటూ చెబుతున్నారు. ఈ వివాదం ఎలా ముగుస్తుందో వేచి చూడాలి మరి.