ఫిల్మ్ ఫేర్ అవార్డుల రెడ్ కార్పెట్ సందర్భంగా భీభత్సమైన క్లీవేజ్ షోతో హాట్ టాపిక్ గా మారింది చందమామ కాజల్. ముప్పై ఏళ్లు దగ్గర పడుతుంటే ఆఫర్లు తగ్గిపోవటంతో అంత హాట్ షో చేసినప్పటికీ అంతా ఉత్తదేనని, కాజల్ పని ఇక అయిపోయినట్లే అనుకున్నారు. కానీ, తాజా ఆఫర్లు మాత్రం ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెబుతుంది. ప్రస్తుతం మహేష్ బ్రహ్మోత్సవం, పవన్ సర్దార్ లో నటిస్తున్న ఈ చిన్నది. తమిళ్లో కూడా జీవా .. విక్రమ్ లకు జోడీగా నటిస్తోంది. అలాగే ఓ చిత్రం కోసం కాజల్ రెండున్నర కోట్లు పారితోషికంగా తీసుకుంటోందనే టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చాలా తక్కువ కాలంలో అగ్రస్థానానికి చేరుకున్న కాజల్ ఆ స్థానాన్ని కాపాడుకుంటూ వస్తోందన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆమె విజయ్ సరసన మరోమారు ఛాన్స్ దక్కించుకుంది. వీరిద్దరు గతంలో తుపాకీ, జిల్లాలో నటించిన సంగతి తెలిసిందే. ఇది విజయ్ కి 60వ సినిమా కావడంతో, మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. కాజల్ ఈ సినిమాకి రెండున్నర కోట్లు పారితోషికంగా అడిగినా .. నిర్మాతలు ఆమెనే ఎంపిక చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. కొత్తగా వచ్చిన హీరోయిన్లు దాదాపు అదే రేంజ్ డిమాండ్ చేయటంతోపాటు వీరిద్దరి హిట్ పెయిర్ కావటంతో తిరిగి కాజల్ నే తీసుకోవాలని భావిస్తున్నారంట. మొత్తానికి కాజల్ క్లీవేజ్ షో పనిచేసిందన్న మాట.