టిప్పుసుల్తాన్ గా లోకనాయకుడు

November 17, 2014 | 11:07 AM | 62 Views
ప్రింట్ కామెంట్

వైవిధ్యభరితమైన పాత్రలు, వినూత్నమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ కమల్ హాసన్. ఈ లోకనాయకుడు త్వరలో మరో క్లాసిక్ అవతారమెత్తనున్నాడు. మైసూర్ కింగ్ టిప్పు సుల్తాన్ జీవితం ఆధారంగా ఓ సినిమా తీయబోతున్నాడు. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారు. ఇక దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఇటీవల విడుదల చేశారు. ప్రస్తుతం కమల్ ‘విశ్వరూపం-2’ చిత్రానికి తుదిమెరుగులు దిద్దే క్రమంలో ఉన్నారు. ఇది పూర్తవగానే టిప్పుసుల్తాన్ చిత్రం ప్రారంభంకాబోతుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్నీ విషయాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. మరి టిప్పు సుల్తాన్ పాత్రలో కమల్ ఏ మేర అలరిస్తాడో చూద్దాం...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ