ఆవునే కాదు ఏ జంతువునూ చంపకూడదు...

April 21, 2015 | 03:29 PM | 9 Views
ప్రింట్ కామెంట్
Kamal_Hassan_about_maharastra_govadha_act_niharonline

సెలబ్రిటీల నోటి వెంట ఏ తప్పుడు మాట వెలువడుతుందా? అని ఎదురు చూసి పనిగట్టుకొని మరీ కేసు వేయడానికి రెడీగా ఉంటున్నారు కొందరు. ఇది తెలిసి కొందరు సినీ సెలబ్రిటీలు పెదవి కదపకుండా జాగ్రత్త పడితే, భావస్వేచ్ఛ ఉండాలని మరికొందరు ముక్కుసూటి తారలు మనసులో ఉన్న భావాన్ని బయటపెట్టేస్తున్నారు. అయితే గోవధ నిషేదంపై నటుడు కమల్ హాసన్ కూడా ఓ  సంచల వ్యాఖ్య చేసారు. కేవలం గో వధపై మాత్రమే నిషేధం విధించడం సరికాదు. నిషేదం అంటూ విధిస్తే అన్ని జంతువుల మీదా విధించాలని అన్నారు. మహావిష్ణువు మత్స్యావతారం దాల్చాడు కనుక.. ఆవులాగే చేప కూడా పవిత్రమైందని, దాన్ని కూడా నిషేధించాలన్నారు. మనదేశంలోని కొన్ని ప్రాంతాల్లో బ్రాహ్మణులు సైతం చేపలు తింటున్నారని.. అదీకాక కొన్ని శతాబ్దాల క్రితం బ్రాహ్మణులు ఆవు మాంసాన్ని తినేవారన్న విషయం పురాతన గ్రంథాలలో ఉందన్నారు. మాంసాహారం, శాఖాహారం ఎవరికి ఇష్టానికి తగినట్టు వారు తీసుకునే వ్యక్తిగత నిర్ణయమని కమల్ హాసన్ స్పష్టం చేసారు. దీనిపై ఎవరి ఆంక్షలు ఉండకూడదన్నారు. మహారాష్ట్రలో గోవధ నిషేధ చట్టం తీసుకువచ్చిన అమలు  నేపథ్యంలో కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా కమల్ హాసన్ ఉత్తమ విలన్ చిత్రం మే డే రోజున విడుదల కానున్న విషయం అందరికీ తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ