నేరం రుజువైతే పదేళ్ళు జైలు....

April 21, 2015 | 03:15 PM | 44 Views
ప్రింట్ కామెంట్
salman_khan_court_case_final_niharonline

బాలీవుడ్ కండల వీరుని భవితవ్యం మే 6నతేలనుంది. ఆయన హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిగా కోర్టులో కేసు నడుస్తున్న విషయం తెలిసిందే. కొన్ని సంవత్సరాలుగా ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఇక ముగింపు దశకు వచ్చింది. మే 6న తుది తీర్పు వెల్లడి కానుంది. నేరం రుజువైతే సల్మాన్ ఖాన్ కు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందట. ఈ కేసులో కోర్టు తీర్పు ఎలా ఉంటుందనే ఆందోళన బాలీవుడ్ వర్గాల్లో నెలకొంది. ఎందుకంటే సల్మాన్ ఖాన్ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఆయనకు శిక్ష పడితే షూటింగులు ఎక్కడ ఆగిపోతాయో నని అభిమానులు, మూవీ మేకర్స్ ఆందోళన పడుతున్నారు. ఆయా సినిమాలపై నిర్మాతలు దాదాపు రూ. 200 కోట్లు ఖర్చు పెట్టారట. ఒక వేళ సల్మాన్‌కు శిక్ష పడితే నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. విచారణ సందర్భంగా సల్మాన్ ఖాన్ తన వాంగ్మూలంలో ‘ముంబైలో అర్థరాత్రి ప్రమాదం జరిగిన సమయంలో కారును తాను నడపలేదని తన వాంగ్మూలంలో తెలిపాడు. అదే సమయంలో తాను మద్యం తాగి ఉన్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని తాను ఎలాంటి మద్యం తీసుకోలేదని స్పష్టం చేశారు సల్మాన్. 2002 సెప్టెంబర్ 28న అర్ధరాత్రి ముంబైలో ఓ హోటల్ నుంచి కారులో వస్తుండగా రోడ్డుపై నిద్రిస్తున్నవారిపైకి ఆ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా నలుగురు గాయపడ్డారు. కేసును విచారణకు స్వీకరించిన స్థానిక కోర్టు.. ఇప్పటివరకు 25 మంది నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసింది. చివరిగా సల్మాన్‌ఖాన్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. సల్మాన్ ఖాన్ కారు డ్రైవర్ విచారణ సందర్భంగా కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చాడు.‘ముంబైలో అర్థరాత్రి ప్రమాదం జరిగిన సమయంలో కారును తానే నడుపుతున్నానని, సల్మాన్ నడపలేదని స్పష్టం చేసాడు. ఈ కేసుకు సంబంధించిన సల్మాన్ ఖాన్ డ్రైవర్ కోర్టుకు హాజరు కావడం అదే తొలిసారి. ఇది డమ్మీ సాక్ష్యం అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ వాదించారు. ప్రధాన నిందితుడిగా ఉన్న సల్మాన్‌ఖాన్ ఇంతకు ముందు ఎప్పుడూ డ్రైవర్ అశోక్‌సింగ్ పేరును ప్రస్తావించలేదని అన్నారు. క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగానూ జరిగిన వాదనలను పిపి కోర్టు దృష్టికి తెచ్చారు. మరి వాదనలు విన్న కోర్టు ఈ కేసులో ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మే 6వ తేదీన వచ్చే తీర్పు కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ