లింగ గొడవ సద్ధు మణిగేందకు ఇటీవల రజనీకాంత్ సెటిమెంట్ చేసుకున్నాడు. అయితే ఇదిసరైనపద్ధతి కాదంటూ కమల్ హాసన్ రజనీకాంత్ ను విమర్శిస్తున్నారు. రజనీ చేసింది హండ్రెడ్ పర్సంట్ తప్పేనంటున్నాడు కమల్. రజనీకాంత్ నటించిన ‘లింగ’ సినిమా ఇటీవలే విడుదలై అట్టర్ ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రం కొనుగోలు చేసిన పంపిణీదారులు తీవ్రంగా నష్టపోయారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని పంపిణీదారులు అందోళనకు దిగడం అందరికీ తెలిసిన విషయమే. దీంతో రజనీకాంత్ డబ్బులు వెనక్కి ఇచ్చేసి ఈ గొడవకు స్వస్తి పలికారు. అయితే ఈ విషయాన్ని కమల్ ఖండించారు. ఈ విషయంపై కమల్ మాట్లాడుతూ... ఈ మధ్య ఫ్లాప్ అయిన సినిమాల విషయంలో డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వాలని పంపిణీదారులు డిమాండ్ చేస్తున్నారు. అది సరైన పద్ధతి కాదంటున్నాడు కమల్. అలాగే రజనీకాంత్ పంపిణీదారులకు నష్టపరిహారం చెల్లించడం ఆమోదించదగిన విషయం కాదని అన్నారు. ఈ విషయంలో రజనీకాంత్ ఎలా స్పందిస్తారో చూడాలి.