1930 దశంలోకి ప్రేక్షకులను తీసుకువెళ్ళిన క్రిష్ ను సినీ ఇండస్ట్రీ అంతా పొగడ్తలతో ముంచెత్తుతోంది. అప్పటి కథలు గాధల గురించి పెద్ద వాళ్ళు చెపుతుంటే వినడంతోనే గొప్ప అనుభూతికి లోనవుతాం... అలాంటిది అప్పటి కాలానికి క్రిష్ అందరినీ తీసుకువెళ్ళడం చాలా గొప్పగా భావిస్తున్నారంతా. ‘కంచె’ ఓ ప్రేమ కథకు 2వ ప్రపంచ యుద్ధం జోడించారు. ఈ సినిమాలో క్రిష్ చూపించిన వార్ ఎపిసోడ్స్ హాలీవుడ్ సినిమాలను తలపిస్తుండడం సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయ్యింది. దసరాకు రిలీజ్ అయిన కలెక్షన్ల పరంగాకూడా బాగానే ఉందది. వరల్డ్ వార్ II నేపధ్యంలో వచ్చిన మొదటి సినిమా కావడం వలన ఈ సినిమాపై బాలీవుడ్ వర్గాలు కన్నేసాయి. అంతే కాదు అప్పుడే ఈ సినిమా ను బాలీవుడ్ లో లో రీమేక్ చెయ్యాలనే ఆలోచనలు కూడా మొదలైపోయాయి. ఇదే విషయాన్ని క్రిష్ కుడా ఖరారు చేసారు. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో ఈ సినిమాని హిందీలో రీమేక్ చేసేలా ప్లాన్ చేస్తున్నామని త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ ఇస్తామని క్రిష్ తెలిపాడు. అలాగే మరో 15 రోజుల్లో తన తదుపరి సినిమాని అనౌన్స్ చేయనున్నాడు క్రిష్.