బ్రూస్ లీ, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలతో మెగా ఫామిలీకి యూఎస్ క్రేజ్ లేదనే ఓ టాక్ వినిపిస్తోంది. కానీ కంచె ప్రీమియర్ షో కు మాత్రం మొదటి ప్రీమియర్ షో ద్వారా 51,920 డాలర్లు వసూలు అయ్యాయట. కానీ ఈ క్రేజ్ వరుణ్ ది అనడానికి లేదు. విడుదలైన ట్రైలర్ ఆడియన్స్ లో ఆసక్తి పెంచింది. ఇప్పటి వరకూ ఇలాంటి సినిమాలు హాలీవుడ్ లోనే వచ్చాయి. మొదటి సారి క్రిష్ ఈ ప్రయత్నం చేయడంతో యూఎస్ ప్రేక్షకులకూ ఈ స్టోరీ పట్ల ఆసక్తి క్రియేట్ అయ్యింది. ఇక దర్శకుడు క్రిష్ కూ కూడా ఇప్పటికే ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ హిందీ సినిమా ‘సింగ్ ఈజ్ బ్లింగ్’ లాంటి సినిమాలతో క్రిష్ కు ఓ బ్రాండ్ ఏర్పడింది. క్లాస్ ప్రేక్షకులు ఎప్పుడూ వైవిద్యానిన కోరు కోవడంతో క్రిష్ క్లాస్ ప్రేక్షకుల అభిమాన డైరెక్టర్ అయిపోయాడు. రెండో ప్రపంచయుద్ధానికి ఓ ప్రేమకథను జోడించి క్రిష్ మంచి సక్సెస్ సాధించాడు. వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ లకు ఈ సినిమా నటన పరంగా మంచి పేరు తెస్తుంది. విడుదలైన అన్నిచోట్ల ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.