ఇప్పటి పరిస్థితుల్లో వివాహం, ప్రేమ బంధాలు ఎంత తేలిగ్గా తీసుకుంటే అంత మంచిదన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. ఒకరితో డేటింగ్ ఇంకొకరితో పెళ్ళిళ్ళు... విడిపోవడాలు... కొన్నాళ్ళకే కొత్త పరిచయాలు ఇవన్నీ చాలా కామన్ గా జరుగుతున్నాయి. విదేశీ కల్చర్ చాలా ఫాస్ట్ గా మన దేశంలోకి చొచ్చుకువస్తోంది. కానీ ప్రేమ విషయంలో కొందరు సీరియస్ అయిపోయి జీవితాన్ని దుర్భరం చేసుకునే వాళ్ళూ ఉంటారు. ప్రేమించిన వ్యక్తి కళ్లెదుటే ఇంకో వ్యక్తితో కనిపిస్తే తట్టుకోలని స్వభావం కొందరిది. కానీ కాంగన మాత్రం ఓ నెల రోజుల్లోనే మర్చిపోతుందట. అవతలి వ్యక్తి ప్రేమను అంత తేలిగ్గా తీసుకున్నప్పుడు మనం మాత్రం అంత సీరియస్ తీసుకోవడం ఎందుకు? ఇది ఒక మంచి అనుభవం అనుకోవాలి. జాగ్రత్త పడాలి. ఇలాంటివి రిపీట్ కాకుండా మంచి ఎక్స్ పీరియన్స్ అంటోంది. ఆ వ్యక్తి గురించి పదే పదే ఆలోచించనని, ఎందుకంటే తనకు తన మీద చాలా ప్రేమ ఉంటుంది. అది అవతలి వ్యక్తిని చాలా తేలిగ్గా మర్చిపోయేలా చేస్తుంది. అయితే ప్రేమలో ఫెయిల్ అయిన ఆడవాళ్ళకు కంగన చక్కని సలహాలిస్తోంది. మగవాళ్లను అతిగా నమ్మితే మోసపోకతప్పదని, అందుకే వాళ్లను నమ్మవద్దని, మనకు మనం చాలా గర్వంగా బతకాలని అంటోంది. ఈ మధ్య లండన్ లో జరిగిన ఓ మహిళా కార్యక్రమానికి హాజరై స్త్రీలు స్పూర్తి పొందే నాలుగు మంచి మాటలు చెప్పుకొస్తోంది కంగన.