కంగన ముక్కుసూటి తనం చాలా మందికి నచ్చుతుంది. ఆమె ఇండస్ట్రీలో నిలదొక్కుడానికి మొదట ఎన్నో కష్టాలు పడిందన్న విషయం అందరికీ తెలుసు. ఆమె మాటల్లో మహిళలు ఎదగడానికి ఏం చేయాలో... ఏం చేయకూడదో అనే విషయాలు స్పష్టంగా చెపుతున్నట్టుంటాయి. అందుకే ఓ అరుదైన గౌరవం కంగనా రనౌత్ కు దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా అమ్మాయిలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ‘ఉమెన్ ఇన్ ది వరల్డ్’ పేరుతో సమావేశాలు లండన్ లో జరుగనున్నాయి. ఈ చర్చలు ఈనెల 8, 9వ తేదిలలో జరగబోతున్నాయి. అయితే ఈ సమావేశంలో పాల్గొనాలని కంగనాకు ఆ సమిట్ నుంచి ఆహ్వానం అందింది. అంతే కాకుండా ఈ సంధర్భంగా ఆమె తన సక్సెస్ స్టోరీని పంచుకోనున్నారు. ఈ సమావేశాల్లో పాల్గొనే మొదటి బాలీవుడ్ హీరోయిన్ కంగన కావడం విశేషం. గత ఏడాది ఏంజెలినా జోలీ, హిల్లరీ క్లింటన్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈసారి హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్, క్యారీ ముల్లిగన్ వంటి వారు పాల్గొంటున్నారు.