ఫేషన్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి సింపతీ మార్కులు కొట్టేసిన కంగనా రనౌత్... ఆ తరువాత చాలా రోజులు ఆఫర్ల కోసం ఎదురు చూసింది. ఇప్పుడు క్వీన్ సినిమాతో సక్సెస్ కొట్టేసింది... ఇప్పుడు బిజీ నటి అయిపోయింది. ఈ మధ్య ఏదో ఒక కామెంట్ తో సినిమాలు ఉన్నా లేకపోయినా పబ్లిక్ లో టాపిక్ అవ్వడం కొందరికి ఇష్టంగా మారింది. ఆ లిస్టులో కంగన కూడా చేరిపోయింది. ఎప్పుడూ హాట్ హాట్ టాపిక్ లతో అందరి ద్రుష్టినీ ఆకర్షిస్తోంది. ప్రేమ, పెళ్లిళ్ల గురించి పలు వ్యాఖ్యలు చేసింది ఇప్పుడు మరోసారి పెళ్లిపై భారీ లెక్చర్లే దంచుతోంది ఈ అమ్మడు. పెళ్ళంటే ఎప్పుడూ కన్ ఫ్యూజన్ అట... పెళ్లి కంటే డేటింగ్ చాలా నయం కదా అంటోంది. డేటింగ్ అంటే కొత్త కొత్త పరిచయాలతో ఎంజాయ్ చేయడం బాగుందంటోంది. ఈ విషయాలపై బాలీవుడ్ పెద్ద చర్చలు జరుగుతున్నాయి. క్వీన్ చిత్రం ద్వారా జాతీయ అవార్డు అందుకున్న ఈ అమ్మడి సినిమా ‘తను వెడ్స్ మను రిటర్న్’ చిత్రం ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.