కోట్లు గుమ్మరిస్తున్నామంటే... సోపులకు.... షాంపులకు... ఫేస్ క్రీములకు... బ్రాండ్ అంబాసిడర్లుగా పని చేసే వారంతా కంగనను చూసి బుద్ది తెచ్చుకోవాలి. బహుషా ఇప్పటి వరకూ ఏ ఇంత మొత్తం డబ్బును కాలదన్నుకొని ఉండదు. ఇప్పుడు ప్రకటనల వల్ల చిక్కులు కొని తెచ్చుకునే నటులందరూ యాద్ ఆఫర్ ను నిర్మొహమాటంగా తిప్పికొట్టి న నటిగురించే ఆలోచిస్తున్నారు. కంగన ఇంట్లోవారికి ఇష్టం లేకున్నా అడ్డంకులను అధిగమించి జాతీయ ఉత్తమ స్థాయికి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ లో నటించేందుకు కోట్లు ఆఫర్ ఇచ్చినా ఛీ కొట్టి హైలెట్ అయ్యింది. ఈమె గురించి ఇలా ప్రచారం జరుగుతుంటే.... బాలీవుడ్ డాన్స్ తార మాధురీ మాత్రం దేశవ్యాప్తంగా దూమారం రేపుతున్న మ్యాగీ నూడుల్స్ ప్రకటనలో నటించి నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. అభిమాన నటులు ఏదో క్రీము రాసుకుంటే తామూ అదే క్రీము కొనుక్కుని రాసుకోవడం సామాన్య జనాలకు సరదా... అది క్యాష్ చేసుకోవడం ఆ ప్రొడక్టు వారికే కాదు, నటించిన తారకు కూడా కొన్నాళ్ళ వారకూ భారీగానే సొమ్ము ముడుతుంది. ఇప్పుడు కోర్టు ఆ ప్రొడక్టును అమ్మే వారే కాదు... అందుకు పలువిధాలుగా సహకరించినవారు కూడా నిందుతులేనని దీంతో ఆ ప్రకటనలోనటించిన వారు కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సిందే.
నూడుల్స్ లో పరిమితికి మించి సీసం (లెడ్), మోనో సోడియం గ్లూటమేన్ ఉన్నట్లు దేశవ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆ ప్రకటనలో నటించిన మాధురీ దీక్షిత్ పై కేసులు నమోదు అయ్యాయి. ఆమెతో పాటు ఈ యాడ్ ను ప్రమోట్ చేసిన బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ప్రీతి జింటాలపైనా వేర్వేరుగా కేసులు నమోదు అయ్యాయి. ఇక డబ్బు కోసం వీరిలా నటిస్తే జాతీయ అవార్డు విన్నర్ బాలీవుడ్ 'క్వీన్' కంగన దాన్ని తిరగరాసింది. తమ కంపెనీ ప్రకటనలో నటిస్తే ఏకంగా రెండు కోట్లు ఇస్తామన్నా ససేమిరా అంది. 'ఫెయిర్' అనే పదమే తనకు నచ్చదని, విలువలే తన ఆస్థి అంటూ మొహం మీద చెప్పింది. యువతకి అందం తెచ్చేది ఆత్మ విశ్వాసం, శక్తి సామర్థ్యాలు, తెలివితేటలే కానీ వాళ్లు రాసుకునే క్రీమ్ వల్ల కాదని తెగేసి చెప్పటం విశేషం. దాంతో కంగనా నిర్ణయాన్ని అందరూ శభాష్ అని మెచ్చుకున్నారు. ఇక కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్న సెలిబ్రిటీలు తమను కోట్లాది మంది ఫాలో అవుతున్నారనే విషయాన్ని కాస్త ఆలోచిస్తే మంచిదేమో. ప్రకటనల్లో నటించేటప్పుడు వచ్చే రెమ్యూనరేషన్ తో పాటు ఆ ఉత్పత్తి ఎలాంటిది? జనానికి మంచి చేసేదా, చెడు చేసేదా అనే విషయాలపై తారలు ఆలోచించాలి.