పెళ్ళి గురించి తనకో స్థిరమైన అభిప్రాయం లేదనీ, ఒక్కో రోజు ఒక్కోలా అనిపిస్తుందని అంటోంది కంగన. ‘తను వెడ్స్ మను’కి సీక్వెల్‌గా ఆమె ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ అనే సినిమాలో మాధవన్ కు జతగా నటించింది. ఆ చిత్రం మే 22న విడుదల కాబోతోంది. వివాహ బంధం నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో నటించిన తరువాత కూడా పెళ్ళి గురించిన ఒక అవగాహన రాలేదా? అని అడిగితే.... ‘‘లేదు. నేను ఏ కథనూ మనసు వరకూ తీసుకెళ్లను. ఒకవేళ నిజంగా ఆలోచించే కథే అయితే అప్పుడు నా తప్పకుండా నా ఆలోచనల్లో మార్పు వస్తుంది. ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ వివాహ బంధం గురించిన కథే అయినప్పటికీ ఇది ఓ ప్రేమ కథలా ఉంటుంది. తమ ప్రేమను, బంధాన్ని పరీక్షించుకుని చివరికి ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అనే నిర్ణయానికి వచ్చేస్తారు’’ అన్నది కంగన. పెళ్ళెప్పుడు చేసుకుంటారు? అన్నప్రశ్నకు ‘‘ఇప్పుడు నాకు 28 ఏళ్లు. కెరీర్ బ్రహ్మాండంగా ఉంది. పెళ్ళికి మూడు పదులు దాటితే బాగుంటుంది’’ అన్నది కంగన. మూడు పదులు దాటటడమే కాదు 35 ఏళ్ళకు పెళ్ళి చేసుకుంటే బాగుంటుందట... సినిమా వాళ్ళకు సినిమా ఛాన్సులు వస్తున్నంత వరకూ పెళ్ళి చేసుకోవాలనే అనిపించదు... ఏమంటారు?