ఆ సినిమా గురించి కంగనా కంగారు...

June 26, 2015 | 06:06 PM | 5 Views
ప్రింట్ కామెంట్
kangana_ranaut_tention_about_her_old_movie_niharoline

క్వీన్ సినిమాతో బాలీవుడ్ లో తన ఇమేజ్ అమాంతం పెంచేసుకుంది కంగనా రనౌత్. ఇప్పుడు ఆమె టాక్ ఆఫ్ ది బాలీవుడ్. క్వీన్ తో పాటు ఈ ఏడాది తను వెడ్స్ మనూ రిటర్న్స్ తో గోల్డెన్ స్టార్ గా పిలిపించుకుంటోంది. ప్రస్తుతం బాలీవుడ్ ఆమె బొమ్మ కనిపిస్తే చాలు వంద కోట్లు గ్యారెంటీ అనే స్థాయికి చేరుకుంది. హీరోయిన్ గా పీక్ లో ఉన్న కంగనా తన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుందేమోనని ఓ సినిమా గురించి తెగ కంగారు పడుతోందట. ఆ సినిమానే ఐ లవ్ న్యూ ఇయర్’. హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు లేని టైంలో నాలుగేళ్ల కిందట కంగనా నటించిన సినిమా ఇది. సన్నీ డియోల్ కధానాయకుడు. అప్పుడు చేతికి ఏ సినిమా వస్తే ఆ సినిమాను ఒప్పేసుకునే స్థితిలో ఉన్న కంగనా ముందు వెనకా చూసుకోకుండా ఈ సినిమాకు సంతకం పెట్టేసింది. అయితే ప్రొడక్షన్ సమయంలోనే ఆ సినిమాలో విషయం ఏమీ లేదని ఆమెకు అర్థమైపోయిందట. ఆ సంగతి మేకర్స్ కు కూడా తెలిసిపోయిందో ఏమో... సినిమాను పూర్తి చేయకుండానే వదిలేశారు. అయితే ఇప్పుడు కంగనా జోరు చూసి... ఈ వేడిలో ఆ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట ఆ సినిమా మేకర్స్. మిగిన సన్నివేశాలు ఎలాగోలా పూర్తి చేసి రిలీజ్ చేసేద్దామని తొందర పడుతున్నారట. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ