ఈ హీరోయిన్ ను ఎప్పుడూ చూసినట్టు కనిపించడం లేదు. కానీ ఈమె తెలుగులో నానితో ‘జెండాపై కపిరాజు’ చిత్రంలో చేసింది. కన్నడలో పాపులర్ హీరోయిన్ అయిన రాగిణి ద్వివేది నానితో చేసిన తెలుగు సినిమా ఫ్లాప్ కారణంగా ఈమెను తెలుగు వారు అంతగా గుర్తించే అవకాశం లేదు. అయితే ఈమె ఓ సినిమా (నానే నెక్స్ట్ సీఎం- తదుపరి ముఖ్యమంత్రి నేనే) షూటింగ్ లో జరిగిన ప్రమాడదనవకవ తీవ్రంగా గాయపడింది. ఆమెను వెంటనే చికిత్స కోసం ఓ ప్రేవట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. రాగిణి ద్వివేది ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. షూటింగ్ లో భాగంగా ఆదివారం మైసూర్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మూడు గంటల సమయంలో ఓ ఫైట్ సీన్ లో భాగంగా ఫైటర్ విసిరిన హాకీ స్టిక్ ను తప్పించుకునే క్రమంలో అది నేరుగా వచ్చి ఆమె తలకు తగిలింది. వెంటనే ఆమె కింద పడిపోయింది. దీంతో హుటా హుటీన చిత్ర యూనిట్ ఆమెను స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చేర్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు మెరుగ్గానే ఉందంటున్నారు. ప్రీమియర్ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు.