సెక్సీ నటి మంత్రి కాబోతుంది

October 29, 2015 | 11:14 AM | 1 Views
ప్రింట్ కామెంట్
kannada_actress_ramya_health_minister_ambarish_niharonline

ఒకప్పుడు సినీ తారలుగా వెలిగివారు సీనియర్లు అయ్యాక రాజకీయాల్లోకి వచ్చి రాణించేవారు. ఆ తర్వాత జనాల్లో వారి క్రేజ్ తగ్గటం, దాంతో పార్టీలో వారి ప్రయారిటీ తగ్గటం జరుగుతూ వస్తుంది. అప్పట్లో సినిమాల్లో ఉండగానే రాజకీయాలపై కాస్త అవగాహన పెంచుకుని ఆపై సినిమాలకు స్వస్తి చెప్పాకనే పొలిటికల్ ఎంట్రీ చేసేవారు. కానీ, ఇప్పుడు అలా లేదు. జనరేషన్ గురించి పట్టించుకోకుండా మూడు పదులు దాటకముందే రాజకీయాల్లోకి దూకుతున్నారు. ముఖ్యంగా గ్లామర్ పరంగా హీరోయిన్లు గురించి జనాలను త్వరగా ఆకర్షిస్తారని భావిస్తున్న పార్టీలు కూడా వారికి రెడ్ కార్పెట్ పరుస్తున్నారు.

శాండల్ వుడ్ లో సెక్సీ హీరోయిన్ గా రాణించిన రమ్య అలియాస్ దివ్య స్పందన ఇప్పుడు కన్నడ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగింది. చిన్న వయసులోనే రాజకీయాల్లో రాటు దేలుతూ వస్తుంది. గత లోక్ సభలో ఎంపీగా కూడా వ్యవహరించిన సినీ నటి రమ్య ఇప్పుడు ఆరోగ్యమంత్రి కానున్నారని సమాచారం. కన్నడ కాంగ్రెస్ అంతర్గత సమాచారం ప్రకారం సినీ నటుడు, ఆరోగ్య శాఖ మంత్రి అంబరీష్ ను తొలగించి, ఆయన స్థానంలో రమ్యను ఆరోగ్య శాఖ మంత్రిగా నియమించాలని అధిష్ఠానం ఆదేశించినట్టు తెలుస్తోంది.

గత ఏడాది అనారోగ్యం బారిన పడడానికి ముందు కన్నడ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన సినీ నటుడు అంబరీష్ ను వైద్యం నిమిత్తం సింగపూర్ తరలించారు. ఈ సందర్భంగా ఆయన వైద్యానికి అయిన కోటిన్నర ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. అప్పటి నుంచి ఆయనపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ మధ్య ఆయనపై పార్టీ నేతలు బహిరంగ విమర్శలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో అంతర్గత కుమ్ములాటలను అదుపు చేసేందుకు రమ్యను మంత్రిగా చేయాలని అధిష్ఠానం ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎటువంటి సభలో హోదా లేని ఆమెను ముందు మంత్రిగా ఎన్నుకుని ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తారని సమాచారం. అన్నట్టు ఈవిడగారు గతంలో కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అభిమన్యు సినిమాలో హీరోయిన్ గా నటించింది. సూర్యతో సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రంలో జత కట్టింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ