కన్నడ నటుడు స్వర్గీయ రాజ్ కుమార్ పెద్ద కుమారుడైన శివరాజ్ కుమార్ గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆయన మంగళవారం జిమ్ కు వెళ్ళగా అక్కడ చాతీలో నొప్పి రావడంతో ఆయనను వెంటనే ట్రీట్ మెంట్ కోసం హాస్పిటల్ కు తరలించారు. ఆయనకు హై బ్లడ్ ప్రెషర్ కారణంగా గుండెపై వత్తిడి ఏర్పడి ఈ పరిస్థితికి దారితీసినట్టు తెలిపారు. జిమ్ స్టాఫ్ ఆయనను హుటాహుటిని ఆస్పత్రికి తీసుకువెళ్ళి ఇసిజి, ఆంజియోగ్రామ్ పరీక్షలు చేయించారు. ఆస్పత్రి వారు ఆయనకు రెండు చోట్ల వాల్వ్స్ మూసుకుపోయినట్టు గమనించారు. అందువల్ల ఆయనకు ఆంజియో ప్లాస్టీ లేదా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉందని తెలిపారు.