జానపద హీరోగా ఒక వెలుగు వెలిగి తరువాత జీవితంలో చితికిపోయిన అలనాటి హీరో దివంగత కాంతారావు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. దివంగత నటుడు టీఎల్ కాంతారావు సతీమణి హైమావతి(80)కి ప్రతీ నెలా రూ. పదివేల ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. నల్గొండ జిల్లాకు చెందిన కాంతారావు అయిదు దశాబ్దాల పాటు చిత్రాల్లో నటించారు. తర్వాత అనారోగ్యంతో మరణించారు. కాంతారావు మరణానంతరం ఆయన కుటుంబం దీనస్థితిలో ఉన్న విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. జనవరి నుంచి ఈ సాయం అందుతుంది. ఆయన మరణం తరువాత కుటుంబం పరిస్థితి మరింత దిగజారింది. ప్రభుత్వం ఆయనకు 2000లో రఘుపతి వెంకయ్య అవార్డు ప్రదానం చేసి సత్కరించింది.