అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సినీ దర్శకుడు కె.బాలచందర్ కోలుకుంటున్నారు. వివిధ అనారోగ్య సమస్యల కారణంగా రెండు రోజుల క్రితం బాలచందర్ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన అనారోగ్యం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. అయితే ఆయన క్రమేణా కోలుకుంటున్నారని ఆసుపత్రివర్గాలు ప్రకటించాయి. ఈ మేరకు ఐసియు వార్డులో ఆయన ఫొటో ని విడుదల చేసారు. తీవ్ర అనారోగ్యానికి గురైన బాలచందర్ చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో బాలచందర్ తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు. కమలహాసన్, రజినీకాంత్, మమ్ముట్టీ, చిరంజీవి(తమిళ సినిమాకు)లను సినిమా పరిశ్రమకు పరిచయం చేసింది బాలచందరే. మరో పక్క ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ బాలచందర్‌పై వచ్చిన పుకార్లను నమ్ముతూ స్వర్గస్థులైన బాలచందర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ట్వీట్ చేశారు. ఇండియన్ సినిమాలో విలక్షణ దర్శకుడని కొనియాడారు. అసలు విషయం తెలుసుకుని మళ్లీ ట్వీట్టర్లో స్పందిస్తూ సారీ చెప్పారు. అందుకే ఆస్పత్రివారు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఫొటోతో సహ ఫేస్ బుక్ లో పెడుతున్నారు.