శ్రీమంతుడి దోశ రేటు ఎంతో తెలుసా?

April 09, 2016 | 04:50 PM | 3 Views
ప్రింట్ కామెంట్
srimanthudu-dosa-niharonline

వ్యాపారం పెంచుకోవడంలో తెలుగు రాష్ట్రాల్లో హోటల్స్ తెలివిని ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని, వారికి త్వరగా కనెక్ట్ అయ్యే విధంగా బిజినెస్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాయి. ఇందులో భాగంగా తాము తయారు చేసే వంటకాలకు సినిమాలు, సినీ నటుల పేర్లు పెడుతూ వినూత్నంగా వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.

                                గత వారం భీమవరంలో 'సర్దార్ గబ్బర్ సింగ్' మెనూను పరిచయం చేస్తూ ఓ హోటల్ వినియోగదారులకు వల వేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు హైదరాబాదులో మరో హోటల్ సినీ వాసనలతో సందడి చేస్తోంది. ఫిలింనగర్ రోడ్ నెంబర్ 1 లో ఉగాది రోజున కొత్తగా ఏర్పాటు చేసిన 'కారప్పొడి' రెస్టారెంట్లో 'శ్రీమంతుడి' దోశెలు సందడి చేస్తున్నాయి. ఈ దోశె ధర 670 రూపాయలని రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇందులో బంగారం పూతను ఐదు లేయర్లుగా దోశెపై పూసినట్టు వారు వెల్లడించారు. సంప్రదాయానికి భిన్నంగా వినూత్నంగా ఇలాంటి వంటకాలను తయారు చేసి, వినియోగదారులకు పరిచయం చేస్తూ లాభాల బాట పడుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ