బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహర్ దృష్టంతా మన సినిమాలపై, మన హీరోలపై పడిందన్న టాక్ వినిపిస్తోంది. రాజమౌళి ని మచ్చిక చేసుకుని బాహుబలిని బాలీవుడ్ లో విడుదల చేసి డబ్బులు బానే దండుకున్నాడు. ఇప్పుడు ఆయన దృష్టి అఖిల్ సినిమాపై పడిందట. ఈ సినిమాను రీమేక్ చేస్తాడా? తన సొంత బేనర్ పై డబ్బింగ్ చేసి విడుదల చేయాలనుకుంటున్నాడా అనే విషయంలో క్లారిటీ లేకపోయినా.... నాగార్జునతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అఖిల్ బాబు ఇప్పటికే జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. సినిమాలు రాకుండానే ప్రకటనల ద్వారా గుర్తుంపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే టైటాన్, కార్బన్ మోబైల్స్, మౌంటెన్ డ్యూ వంటి పెద్ద సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశాడు అఖిల్. ఈ గుర్తింపు ఎలాగూ ఉండనే ఉంది కాబట్టి, కుర్రాడి సినిమాను బాలీవుడ్ లో రిలీజ్ చేసి డబ్బులు దండుకుందామనే ఆలోచన బాగానే వర్కవుట్ అయ్యేలా ఉంది. అఖిల్ తో సినిమా చేసినా అక్కడి జనం రిసీవ్ చేసుకునేలా ఉన్నారు. ఎలాగూ అమల కూడా నార్త్ ఇండియన్ కావడంతో, అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ బాగానే ఉంటుందని నాగార్జున కూడా అనుకుంటున్నట్టు సమాచారం. తెలుగులో మాత్రమే స్టార్ హీరోలుగా ఉంటున్న అక్కినేని ఫామిలీ నుంచి ఒక హీరో జాతీయ స్థాయిలో వెళితే అక్కినేని వారి స్థాయి మరింత పెరుగుతుందని అందరూ భావిస్తున్నారు.