దర్శక, నిర్మాత కరణ్ జోహార్‌కి ఇప్పుడు తీయబోయే చిత్రంతో రెండు కోరికలూ తీరతాయట. ఆయన కోరికలేమిటంటే... ఐశ్వర్యారాయ్‌తో ఓ సినిమా చేయాలనీ, తనకు నచ్చిన జంట రణ్‌బీర్ కపూర్-అనుష్క శర్మ లతో ఓ చిత్రం చేయాలనేవి. అయితే ఈ రెండు కోరికలూ ‘ఏ దిల్ హై ముష్కిల్’ అనే ఒకే చిత్రం ద్వారా తీరుతున్నాయంటున్నాడు కరణ్ ఆనందంగా. పదిహేనేళ్ల క్రితం దర్శకత్వం వహించిన ‘కుఛ్ కుఛ్ హోతా హై’, తర్వాత చేసిన ‘కభీ ఖుషీ కభీ గమ్’ సమయం నుంచీ ఐశ్వర్యారాయ్‌తో ఓ చిత్రం చేయాలనుకున్నాడట ఈ దర్శకుడు. ‘బాంబే వెల్వెట్’ చిత్రానికి సంబంధించిన ఫొటోల్లో రణ్‌బీర్, అనుష్కల మధ్య కెమిస్ట్రీ చూసి, ఆ జంటతో కూడా ఓ చిత్రం చేయాలనుకున్నాడట. ఇక ఈ ముగ్గురికీ తగ్గట్టు ఆయనో కథ తయారు చేసుకున్నాడు. ప్రేమ నేపథ్యంలో సాగే ఈ కథ విని ఐష్, రణ్‌బీర్, అనుష్కలు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రేమ ద్వారా జీవితానికి వచ్చే పరిపూర్ణత, అదే ప్రేమ వల్ల విరిగే మనసుల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆయన ఇన్ని సినిమాలు చేసినప్పటికీ ఇంత త్వరగా పాత్రల్ని ఎంపిక చేయడం మాత్రం ఈ సినిమాతోనే జరిగిందని చెపుతున్నాడట.