బాహుబలి సినిమా రిలీజ్ కు ముందే దేశ మంతా ఓ సంచలనం సృష్టించింది. రాజమౌళి ఈగ సినిమాతోనే మన ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆయన సినిమాలపై క్రేజ్ పెరిగిపోయింది. బాహుబలి సినిమా తమిళ వెర్షన్ భారీ రేటుకే అమ్ముడు పోయింది. ఇప్పుడు హిందీ వెర్షన్ కూడా సొంతం చేసుకున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ దీని ప్రదర్శన హక్కులను తీసుకున్నాడు. దీన్ని ఎంత మొత్తానికి కొనుక్కున్నారనేది తెలియకపోయినప్పటికీ, మంచి రేటుకే అమ్మడు పోయినట్టు అనుకుంటున్నారు. ఈ చిత్రం హిందీ వెర్షన్ ధర్మ ప్రొడక్షన్ సంస్థ నార్త్ లో విడుదల చేస్తున్నది. మే 15న ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.