ఆన్ లైన్ స్కాం బాధితుల్లో చేరిన బాలీవుడ్ హీరో

June 08, 2015 | 02:28 PM | 0 Views
ప్రింట్ కామెంట్
karan_singh_gorover_latary_scam_niharonline

ఆన్ లైన్ లాటరీ స్కాం చేతిలో ఓ బాలీవుడ్ నటుడు మోసపోయాడు. కరణ్ సింగ్ గ్రోవర్ ఈ మోసం వల్ల 5.6 లక్షల రూపాయలు నష్టపోయాడు. ఈ విషయాన్ని ఆ హీరో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరణ్ కు పెద్ద మొత్తంలో లాటరీ వచ్చిందంటూ ఓ ఈమెయిల్ అందింది. ఈ డబ్బు తీసుకునేందుకు కొంత మొత్తం ఫీజుగా చెల్లించాలని లాటరీ నిర్వాహకులు కోరారు. కరణ్ వారికి 5.60 లక్షలు చెల్లించారు. అయితే తనకు లాటరీ డబ్బును పంపలేదని  సంప్రదించేందుకు ప్రయత్నించగా నిర్వాహకులు అందుబాటులోకి రాలేదని కరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలీవుడ్ చిత్రం అలోన్ లో కరణ్, బిపాసా బసు సరసన నటించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ