ఇప్పటి వరకూ కరీనా నటించిన చిత్రాలు ఎలాంటి రిహార్సల్స్ అవసరం లేకపోయిందట. కానీ ఇప్పుడు నటిస్తున్న జాతీయ అవార్డు దర్శకుడు ఆర్.బాల్కీ దర్శకత్వంలోని క్యారెక్టర్ కోసం రిహార్సల్స్ అవసరం పడిందట కరీనాకు. ఇప్పటి వరకూ ఏ సినిమాలోనూ నటించిన ఓ డిఫరెంట్ క్యారెక్టర్ అట ఇది. త్వరలో సెట్స్ కెళ్లనున్న ఈ సినిమా కోసం ప్రత్యేక కసరత్తు చేయాల్సి వస్తోందట. ఎలాగంటే హీరో అర్జున్ కపూర్; కరీనా దీనికోసం ఓ గదిలో రోజులపాటు గడుపుతున్నారట. అంటే ఎమోషన్స్ రావడం కోసం... అంటే ఈ చిత్రంలో వీళ్ళిద్దరూ ఒకరిమీద ఒకరు ఫైర్ అవ్వాలట. బెబో ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ.. నా కెరీర్ లో ఇంతవరకూ చేయని క్యారెక్టర్ ఇది. ఓ కార్పొరెట్ కంపెనీని శాసించే టాప్ ఎగ్జిక్యూటివ్ పాత్రలో నటిస్తున్నా. మా ఆయన (అర్జున్ కపూర్) ఇంట్లోనే ఉంటాడు. ఫ్యామిలీ మొత్తాన్ని నడిపించే అమ్మాయిగా నటిస్తున్నా. నా కెరీర్ లోనే ఇలాంటి పాత్రలో మునుపెన్నడూ నటించలేదు. అందుకే ఈ క్యారెక్టర్ కోసం ప్రతిరోజూ 3గంటల పాటు ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకున్నా. ఇప్పటికే సైఫ్ కి కూడా ఈ మాట చెప్పాను.. అని చెప్పింది. అంటే రోజూ 3గంటల పాటు ప్రత్యేక సాధన కోసం కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేసి అర్జున్ కపూర్ తో గడిపేస్తుందట. ఇన్నేళ్లలో ఎప్పుడూ రిహార్సల్ అనే అవసరమే లేకుండా స్పాంటేనియస్ గా నటించేసిన ఈమెకు ఇదేం పరీక్షోగానీ....ఇప్పటి వరకూ ఈమె సినిమాలన్నీ కోట్లకు కోట్లు లాభాలార్జించి పెట్టాయి. అందుకే రెండు దశాబ్ధాలుగా తిరుగులేని నాయికగా బాలీవుడ్ ని ఏల్తోంది కరీన. కేవలం స్టార్ హీరోల సరసన నటిస్తూ.. సినిమా అదృష్ట దేవతగా పేరు తెచ్చుకుంది. అయితే అంత క్రేజు ఉన్న ఈ భామ నేచర్ మాత్రం చాలా సాఫ్ట్ అంట... ఈ కొత్త సినిమాలో మాత్రం కాస్త ఫైర్ గా కనిపించాలట... అందుకే నాచురాలిటీ కోసం ఈ రిహార్సల్స్ చేయాల్సి వస్తోందట.