రాములమ్మ రీ-ఎంట్రీ సీక్వెల్ తోనా?

May 05, 2016 | 03:42 PM | 3 Views
ప్రింట్ కామెంట్
vijayashanthi-back-to-films-osey-ramulamma-sequel-niharonline

తొలినాళ్లలో గ్లామర్ పాత్రలతోపాటు ఆపై డేరింగ్ అండ్ డాషింగ్ పాత్రలకు పెట్టింది పేరుగా లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించింది విజయశాంతి. కర్తవ్యం, వైజయంతి, ఓసేయ్ రాములమ్మ, రౌడీ దర్బార్ లాంటి చిత్రాలు ఆమె లోని ఎనర్జిటిక్ యాక్షన్ కి తార్కాణాలు. ఆపై రాజకీయాల్లోకి రావటం, ఆపైపై ఆమె ఎదుర్కున్న పరిస్థితులు మనకు తెలిసిందే. గత కొంతకాలంగా రాజకీయాలకి కూడా దూరంగా వున్న విజయశాంతి, తిరిగి నటన వైపు దృష్టి పెట్టిందనే వార్తలు షికార్లు చేశాయి. అయితే ప్రస్తుతం అజ్నాతంలో ఉన్న ఆమె నిజంగానే తన సినిమాకి సంబంధించిన పనుల్లోనే ఉందట.

                              ఓ ప్రముఖ డైరక్టర్ ఆమె కోసం కథ కూడా తయారు చేసే పనిలో ఉన్నాడని, దాదాపు అది పూర్తి కావొచ్చిందని సమాచారం. దేశభక్తికి సంబంధించిన కథాంశాన్ని ఎంచుకుని మన ముందుకు రాబోతుందట. అయితే  'ఒసేయ్ రాములమ్మ'కి సీక్వెల్ చేయనుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. త్వరలో పూర్తి వివరాలు తెలియజేసి, వచ్చే జూన్ నాటికి ఆ సినిమాను తెరపైకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ