బాలీవుడ్ తారల్లో బ్రాండ్ క్వీన్ గా ఐశ్వర్య రాయ్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న నటి ఒక్క కత్రినా కైఫ్ మాత్రమే. చేతి నిండా సినిమాలతో పాటు అడపాదడపా యాడ్ లలో కనిపించి కవ్విస్తుంది ఈ బ్యూటీ. అయితే ఎన్ని యాడ్ లలో నటించినప్పటికీ ఫేస్ క్రీమ్ యాడ్ లలో మాత్రం నటించనని కత్రినా తెగేసి చెప్పేదట. ఎందుకంటే వాటిల్లో కాన్సర్ కారకాలు ఉంటాయని, వాటి వల్ల ప్రజలు నష్టపోతారని చెప్పేదట. దీంతో తమ అభిమాన నటికి జనాల పట్ల ఎంత మమకారమో అని ఫ్యాన్స్ అంతా తెగ ఆనందపడిపోయేవారు. అయితే, వారందరికీ షాక్ ఇస్తూ ఆమె తన నిర్ణయాన్ని మార్చుకుందట. దేశవ్యాప్తంగా పేరున్న ఓ ప్రముఖ ఫేస్ క్రీమ్ సంస్థ కు ప్రచార కర్తగా వ్యవహరించేందుకు ఆమె అంగీకరించినట్లు ఒప్పుకుందట. భారీ పారితోషకం ఆపర్ చేయటంతో ఆమె దీనికి సిద్ధపడ్డట్లు సమాచారం. దీంతో తమ అభిమాన నటి ఉన్నట్టుండి ఇలా మాట తప్పి తమను హర్ట్ చేసిందని ఫ్యాన్స్ కుమిలిపోతున్నారు.