ఇప్పట్లో పెళ్ళి ఆలోచనే లేదట...

August 21, 2015 | 12:45 PM | 4 Views
ప్రింట్ కామెంట్
katrina_kaif_about_marriage_niharonline

కొందరు సినీ తారలను ఎప్పుడు అడిగినా ఇదే ముచ్చట చెపుతుంటారు. అందులో కత్రిన ఒకరు. ఇప్పుడు కత్రిన కైఫ్, రణబీర్ కపూర్ లు ఎక్కడ చూసినా జంటగా కనిపిస్తూ... మీడియా వాళ్ళకు రాసుకోడానికి బోలెడు స్టఫ్ ఇచ్చేస్తున్నారు. మరి లవర్స్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ జంట ఎప్పుడు పెళ్లి ఊసెత్తినా ఒకే మాట వినిపిస్తోంది... ఇప్పట్లో ఆలోచన లేదని. కత్రిన పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం రణబీర్ లండన్ వెళ్లాడని అక్కడ వెడ్డింగ్ రింగ్ తొడిగేశాడని ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అని తెగ వార్తలు వచ్చేసాయి. కానీ నెలలు గడుస్తున్నా అలాంటి చాయలే కనిపించలేదు. ఆ పుకార్లను ఖండించింది కూడా క్రతిన. మరోసారి అదే విషయాన్ని కుండ బద్ధలు కొడుతూ చెప్పుకొచ్చింది ఇటీవల జరిగిన చిట్ చాట్లో...  ప్రస్తుతం ఈ భామ ఫాంటమ్ సినిమాలో కథానాయికగా నటించింది. ఫాంటమ్ త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలు చెబుతూనే వ్యక్తిగత విషయాల్ని ప్రస్థావించింది. ఇప్పట్లో పెళ్ళి, నిశ్చితార్థం వంటి ఆలోచనలే లేవని ఖచ్చితంగా చెప్పేసిందట. పెళ్ళి చేసుకునే వయసు దాటిపోతున్నా... మళ్ళీ అదే పాట పాడుతున్న కత్రినను చూసి.... మూణ్ణెల్లకోసారి ఇదే వార్త రాసుకుంటే పోలా... మళ్ళీ అడగడమెందుకు? అని అనుకుంటున్నారట మీడియా వాళ్ళు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ