ఇప్పుడు సెల్ఫీ పిచ్చి పెరిగిపోయింది అందరికీ... అందులో సెలబ్రిటీలతో సెల్ఫీ తీసుకోవడం మరింత పిచ్చిగా మారింది... ఇది సోషల్ నెట్వర్క్ లో పోస్ట్ చేసుకోవడం ఓ ఫేషన్ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తున్న సెల్ఫీ ఫొటో ఎవరితోనూ దిగింది కాదు... సింగిల్ గా దిగినా ఓ డ్రెస్ కోసమో... మేకప్ వేసుకొని తన అందం చూపించడానికో దిగిన ఫొటో కాదు... కత్రినా కైఫ్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఆహ్వానానికి వెళ్ళిన కత్రినా కైఫ్ ఏ విధమైన మేకప్ లేకుండా తన సెల్ఫీ ఒకటి పోస్ట్ చేసి, కేన్స్ కోసం ఒక ట్విట్టర్ ఎక్కౌంట్ క్రియేట్ చేసి అందులో తన ఫొటో ఇలా పెట్టుకుంది. ఏదో సినిమా కోసం కొంత మంది తారలు అతిగా మేకప్ వేసుకుంటారు గానీ, నిజంగా మేకప్ లేకపోయినా కత్రినా లాంటి ఎంతో మంది నిజమైన అందగత్తెలున్నారు. అతి మేకప్ తో తమ సహజ సౌందర్యాన్ని మరుగున పడేస్తారేమో అనిపిస్తుంది ఈ సెల్ఫీ చూస్తుంటే...