నటి కత్రినా కైఫ్ బాలీవుడ్ హీరోల గురించి షాక్ కు గురయ్యే వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ప్రైవేట్ పార్టీకి హాజరయిన కత్రినాను మీడియా ప్రశ్నించింది. మీకు ఎవరితో నటించేప్పుడు ఇబ్బంది లేకుండా నటించారు అని అడగగా... ఇబ్బంది గురించి అంటే చెప్పటం మరిచిపోయా. బాలీవుడ్ హీరోల్లో కొందరికి అసలు శుభ్రతే లేదు. బెడ్ మీద నుంచి లేవగానే సరాసరి షూటింగ్ కు వచ్చే వారు. వారితో రొమాంటిక్ సీన్లలో నటించాలంటే ఇబ్బందిగా ఉండేది. ఒక్కోసారి ఆ వాసన భరించలేక దాదాపు వాంతి చేసుకున్నంత పని అయ్యేది. ఇంకొందరు ప్రబుద్ధులైతే రాత్రులు ఏకంగా మందు కొట్టి మరుసటి ఉదయం షూటింగ్ లకు వచ్చేవారు. ఇంకా వారితో నటించేప్పుడు అయితే నరకం అని తడబడకుండా చెప్పుకొచ్చింది. అంతేకాదు శుభ్రత విషయంలో దక్షిణాది హీరోలు బాగా సరిగ్గా ఉంటారట. వారితో పనిచేసేప్పుడు తాను ఏ సందర్భంలోనూ ఇబ్బందిగా ఫీలవలేదని, పైగా సెట్లో వారు డీసెంట్ గా ఉంటారని తెగ పోగిడేసింది. బాలీవుడ్ హీరోలు సౌత్ హీరోలను చూసి చాలా నేర్చుకోవాలని అంది. ఇక ఈ కామెంట్లతో బాలీవుడ్ లో కొందరు హీరోలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయ్యింది. రణ్ బీరూ... జాగ్రత్త నాయనా.