మేడమ్ టుస్సాడ్స్ లో చిందేస్తూ కత్రిన

March 28, 2015 | 04:38 PM | 141 Views
ప్రింట్ కామెంట్
katrina_statue_in_london_museum_niharonline

ప్రపంచంలోనే పెద్ద మ్యూజియం ‘మేడమ్ టుస్సాడ్స్’ గురించి అందరికీ తెలుసు. ఇక్కడ మన బాలీవుడ్ స్టార్ల బొమ్మలు కనిపిస్తాయన్న విషయం కూడా ఇంతకు ముందు పేపర్లలో చదివే ఉంటారు. అయితే కొత్తగా ఇందులో కత్రిన కైఫ్ బొమ్మ చేరిపోయింది. ఇక్కడ ఉన్న వాక్స్ బొమ్మలు నిజమైనవేమో ననే భ్రమకలిగించేంత అద్భుతంగా ఉంటాయి. అయితే కత్రినా రూపం కూడా కళ్లముందు ఆవిష్క్రుతమవుతుంది. ఇంతకు ముందు ఈ మ్యూజియంలో అమితాబ్, ఐశ్వర్యరాయ్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్చ సల్మాన్ ఖాన్, ఐశ్వర్య, మాధురీ దీక్షిత్, కరీనా కపూర్ వంటి బాలీవుడ్ ప్రముఖుల బొమ్మలు చోటు సంపాదించగా ఇప్పుడు కొత్తగా వారి పక్కన కత్రిన చేరిపోయింది. 2003లో బూమ్ తో సినిమాలోకి ఎంటరైన కత్రిన, 2008లో ఆసియా సెక్సీయెస్ట్ ఉమెన్ గా కూడా ఎన్నికైంది. గూగుల్ లో ఎక్కువ మంది వెతికిన సెలబ్రెటీల్లో కత్రిన కూడా ఉంది. అయితే లండన్‌లోని ‘మేడమ్ టుస్సాడ్స్’ మ్యూజియం కత్రినా  బొమ్మను డాన్స్ చేస్తున్న పోజులో పెట్టారు. అంటే ‘చిక్‌నీ చమేలీ..’, ‘షీలాకీ జవానీ’ ఎంత పాపులర్ అయితే ఇలాంటి బొమ్మ పెడతారు. తన బొమ్మ లండన్ మ్యూజియంలో చోటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందంటోంది కత్రిన. ఇది తనకు దొరికిన ప్రత్యేక గౌరవంగా ఆమె భావిస్తోంది. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ