కిరణ్, షాలు, రిచా హీరో హీరియిన్లుగా శ్రీ విఘ్నేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ పై సందీప్ దర్శకత్వంలో మరపట్ల కళాధర్ చక్రవర్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.1 చిత్రానికి శైలు అనే టైటిల్ ను నిర్ణయించినట్లు చిత్ర నిర్మాత మరపట్ల కళాధర్ చక్రవర్తి తెలియజేశారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. అందులో భాగంగా ప్రస్తుతం డి.టి.ఎస్.మిక్సింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా...
డైరక్టర్ సందీప్ మాట్లాడుతూ ‘’నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని తెరకెక్కించారు. నటీనటులు కొత్తవారైనప్పటికీ చక్కగా నటించారు. ఇందులో దరశకుడు బి.వి.వి.చౌదరిగారు ఓ కీలకపాత్రలో నటించారు. అందుకు ఆయనకి థాంక్స్. ఈ సినిమా అనుకున్నదానికన్నా బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో భాగంగా డి.టి.ఎస్ వర్క్ జరుగుతుంది. నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.
నిర్మాత మరపట్ల కళాధర్ చక్రవర్తి మాట్లాడుతూ ‘’మా విఘ్నేశ్వర బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.1గా ప్రారంభమైన ఈ చిత్రానికి శైలు అనే టైటిల్ ను నిర్ణయించాం. దర్శకుడు సందీప్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. అనుకున్న దాని కన్నా సినిమా బాగా వచ్చింది. అన్నీ వర్గాల ప్రేక్షకులు అలరించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్ర ఆడియో ను వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రస్తుతం సినిమా డి.టి.ఎస్.మిక్సింగ్ జరుపుకుంటుంది’’ అన్నారు.
వినోద్, నరసింహారాజు, పూర్ణిమ, సౌమ్య, ప్రసాద్, వాసు, నవీన్ ఇతర తారాగణంగ. ఈ చిత్రానికి కథ: వాసు దొడ్డిపట్ల, మాటలు: రఘవంశీ, శౌరి, పాటలు: చిర్రావూరి విజయ్ కుమార్, పైడిశెట్టి శ్రీరామ్, విజయ్ వర్మ, ఆర్ట్: కళా వెంకట్, ఎడిటింగ్: నాగిరెడ్డి.వి, సినిమాటోగ్రఫీ: మహిశేర్ల, మ్యూజిక్: కిషన్ కవాడియా, సహ నిర్మాతలు: కిషోర్ కొసరాజు, నిర్మాత: మరపట్ల కళాధర్ చక్రవర్తి, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సందీప్.