లివ్ ఇన్ రిలేషన్షిప్ జంటలకు ‘కట్టి-బట్టి’ ఆహ్వానం

July 28, 2015 | 02:27 PM | 3 Views
ప్రింట్ కామెంట్
kattibatti_kangana_imran_niharonline

ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ షిప్స్ ట్రెండ్ బాగా నడుస్తోంది... మన సౌత్ లోనూ ఇలాంటి ట్రెండ్ ఉన్నప్పటికీ వీటిపై సినిమాలు తీసి సక్సెస్ చేసేంతగా ట్రెండ్ మారలేదు. అయినప్పటికీ మణిరత్నం ఓకే బంగారం తో హిట్ ఇవ్వగలిగారు.  ఈ సక్సెస్ కు కారణం కంక్లూజన్ మార్చడమే కావచ్చు. ఇలాంటి రిలేషన్స్ నార్త్ లో చాలా ఎక్కువ. అందుకే అక్కడ ఇలాంటి సినిమాలూ ఎక్కువే. ఇప్పుడు కంగనతో కట్టి-బట్టి అనే సినిమా తీస్తున్నారు. బాలీవుడ్ లో క్వీన్ ఆఫ్ ది హీరోయిన్స్ అంటే కంగానే. అందుకే ఈ అమ్మడితో ఈ హాట్ సినిమా మొదలు పెట్టేశారు. తను నటించిన క్వీన్ తను వెడ్స్ మను విజయాలతో ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పేసుకుంది కంగన. అసలు హీరోతో పనే లేకుండా కేవలం లేడీ ఓరియెంటెడ్ కథలతోనే 100కోట్ల క్లబ్ సినిమాలు తీయొచ్చని ఈ రెండు సినిమాలు నిరూపించాయి. ప్రస్తుతం ఈ అమ్మడికి నాలుగైదు సినిమాలు లైన్ లో ఉన్నాయి. అందులో 'కట్టి బట్టి' ఒకటి. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉంది. పెళ్లికి ముందే ప్రేమికుల సహజీవనం అనేది తెరపై చూపిస్తున్నారు. కంగన సరసన ఇమ్రాన్ ఖాన్ కథానాయకుడిగా నటించాడు. నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 18న రిలీజ్ కి సిద్ధమైంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాన్ని ఇప్పట్నుంచే మొదలు పెట్టారట. రొటీన్ కి భిన్నంగా పబ్లిసిటీ ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్ లో భాగంగా నిజ జీవితంలో లివిన్ రిలేషన్ షిప్ సాగిస్తున్న జంటల్ని ఓ ప్రత్యేక కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. అక్కడ తమ అభిప్రాయాల్ని యథేచ్చగా తెలియజేయవచ్చు. నేరుగా ఈ సినిమా కాస్టింగ్ తో కలిసి ముచ్చటించే అవకాశం ఇస్తున్నారు. ఎంత మంది ఈ సాహసానికి సిద్ధమవుతారో చూడాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ