హీరోయిన్లు ఎక్స్ పోజింగ్ గా ఉంటే, ఛాన్సులు బాగానే వాస్తాయన్న మాట సినీ పరిశ్రమలో సర్వ సాధారణం. కానీ అలాంటి పాత్రలు చేయకుండా మెప్పించి పై స్థాయికి చేరుకున్న హీరోయిన్లూ ఉన్నారు. సౌందర్య, స్నేహ, నిత్యామీనన్ లు కూడా ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉంటూ తమ స్థానాన్ని కొన్నాళ్ళ పాటు టాప్ లెవెల్లో పదిలపరచుకున్నారు. అంటే అందాల ఆరబోత లేకుండానూ సినిమాల్లో నటించవచ్చని నిరూపించుకున్నారు. ఇప్పుడు అలాంటి స్టేట్ మెంట్ తో మేకన కూతురు కీర్తి సురేష్ వార్తలోకొచ్చింది. ఈ అమ్మడు కూడా ఎక్స్ పోజింగ్ కు నో చెపుతోంది. చిన్న నాటనే తెరమీద తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇప్పుడు హీరోయిన్ గా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
ఏ మోడల్ అయినా కూడా హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొదట్లో తాను గ్లామర్ పాత్రలకు దూరం అంటూ భారీ కామెంట్లు చేస్తుంటారు. కానీ రెండు సినిమాలు చేయగానే కాస్త రెమ్యునరేషన్ పెంచేయడం,దీంతో సినిమా ఆఫర్లు తగ్గిపోతుండటం వల్ల గ్లామర్ పాత్రలే కాకుండా లిప్ లాక్ లకు, బికినీలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంటారు. అయితే కొత్తగా వచ్చిన కీర్తి సురేష్ కూడా ఇలాంటి మాటలే చెబుతోంది. ప్రముఖ సీనియర్ నటి మేనక కూతురైన కీర్తిసురేష్ ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస చిత్రాలతో బిజీ అవుతోంది. తమిళంలో ఈ అమ్మడు నటించిన చిత్రాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి. లుక్స్ పరంగా కీర్తికి మంచి మార్కులే పడటంతో కోలీవుడ్ దర్శకనిర్మాతలు ఈ అమ్మడిపై ఎక్కువ దృష్టిపెడుతున్నారు. తెలుగులో ఇప్పుడు హరికథ సినిమాలో హీరో రామ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.
ఈ భామ గ్లామర్ పాత్రల్లో చెయ్యననడమే కాక, విజయ్, అజిత్ వంటి ఎంత పెద్ద స్టార్ హీరోలతో ఛాన్స్ వచ్చినా అందాల ఆరబోతకు నో అనే అంటానని ఖరాఖండీగా చెపుతోంది.