బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ అందరికీ తెలిసిన వాడే... ఏడెనిమిదేళ్ళ క్రితం అమ్మాయిల క్రేజీ యంగ్ హీరో ఇతను. ‘ఏ ఇష్క్ హాయె... బైటే భిటాయె... జెన్నత్ దిఖాయె...ఓ రామా...’ అంటూ అమ్మాయిల కలల రాకుమారుడయ్యాడు. జబ్ వి మెట్ లో కరీనాతో కలిసి నటించిన ఈ నటుడు అప్పట్లో ఆమెను బుట్టలో వేసేశాడు. ఆ తరువాత ప్రియాంక చోప్రా... పలు బాలీవుడ్ హీరోయిన్లతో ఎఫైర్ల నడిపిన షాహిద్ ఇప్పుడు బుద్ధిగా ఓ ఇంటివాడు అవుతున్నాడు. షాహిద్ ఢిల్లీకి చెందిన అమ్మాయి మీరా రాజ్‌పుత్‌ను పెళ్లాడబోతున్నాడు. వీరి వివాహం జులై 7న గుర్‌గావ్‌లో జరుగబోతోంది. పెళ్ళికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు ప్రెస్ కు రిలీజ్ చేశాడు. కానీ ఈ పెళ్ళికి మాత్రం ఆహ్వానితులు తక్కువ మందే ఉంటారని సమాచారం. వివాహం కేవలం కుటుంబ సభ్యులు, కొందరు క్లోజ్ ఫ్రెండ్స్ సమక్షంలో జరుగబోతోందని తెలుస్తోంది. వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా సినీ ప్రముఖులందరినీ పిలిచి జరుపుకుంటారని అంటున్నారు. షాహిద్ పెళ్లి పనులు దగ్గరుండి చూసుకునేందుకు అతడి ముగ్గురమ్మలూ రంగంలోకి దిగుతున్నారు. తమ ముద్దుల కొడుకును పెళ్లికొడుకును చేసి తమ ముచ్చట తీర్చుకోబోతున్నారు. ఇంతకూ ఈ ముగ్గురు అమ్మలు ఎవరంటారా? షాహిద్ సొంతతల్లి, పెంచిన తల్లి, సవతి తల్లి. ఈ ముగ్గురు అమ్మలూ షాహిద్ జీవితంలో కీలక పాత్ర పోషించిన వారే. తల్లి నీలిమా ఆజిమ్, తండ్రి పంకజ్ కపూర్ విడాకులు తీసుకున్న తరువాత షాహిద్ కొంతకాలం తండ్రి వద్దా, కొంతకాలం తల్లి వద్దా పెరిగాడు. అలా... తండ్రి రెండో భార్య అయిన సుప్రియా పాథక్ కూ, తల్లి రెండో భర్త అయిన రాజేశ్ ఖత్తార్ కూ షాహిద్ దగ్గరయ్యాడు. వారు కూడా అతన్ని సొంత కొడుకులాగానే సాకారు. ఇక.... తల్లి నీలిమా ఆజిమ్, రాజేశ్ కత్తార్ తోనూ తెగదెంపులు చేసుకున్నాక అతడు వందన సజ్నానీని వివాహమాడాడు. అలా ఆమెతోనూ షాహిద్ కు మంచి సంబంధమే ఉందట.