ఈ ట్రిక్కులతో ప్రేక్షకులను లాక్కురాగలరా?

June 18, 2015 | 12:43 PM | 0 Views
ప్రింట్ కామెంట్
kerintha_pramotion_niharonline

కొన్ని సినిమాలు ప్రమోషన్ సరిగా లేక ఆడలేదంటుంటారు... ఎందుకంటే వాటిని టీవీలో చూసినప్పుడు సినిమా బాగానే ఉంది కదా? ఎందుకు ఆడలేదనే టాక్ వస్తుంటుంది. పోటీగా థియేటర్లలో వేరే సినిమాలు ఆడుతుందడం వల్లనో... ప్రచారం సరిగా జరగక పోవడం వల్లనో అనే మాట కూడా వినిపిస్తుంటుంది. కానీ ఈ మధ్య కాలంలో ప్రమోషన్ కోసమంటూ టీమంతా దేశమంతా పయనం కడుతోంది. వీటి వల్ల జనాల్ని థియేటర్ల వరకు ఏ మాత్రం లాక్కు రాగలరనేదే పెద్ద క్వెశ్చన్ మార్క్ అవుతోంది. కాని అగ్ర నిర్మాత దిల్‌ రాజు మాత్రం ‘‘కేరింత’’ విషయంతో తన నటీనటులతో బాగానే కేరింతలు కొట్టిస్తున్నారు. దీని కలెక్షన్లు ఇప్పటి వరకూ ఏ మాత్రం రాబట్టగలిగారో గానీ... ఆయన టీమ్ తో ఈ ప్రమోషన్లు మాత్రం ఆగడం లేదు... కొత్త కొత్త ట్రిక్కులు ప్లే చేస్తున్నారు.  నిన్న మొన్నటివరకు షాపింగ్‌ మాల్స్‌ లో కేరింత టీమ్ తో డాన్సులు చేయించారు. ఇప్పుడు ఫుట్‌బాల్‌ కూడా ఆడిస్తాడట. నటి శ్రీదివ్య అటెండ్ కావడం లేదు గానీ మిగతా టీమంతా చాలా కష్టపడుతున్నారు పాపం.... ఇంతకీ ఈ సినిమాకు దిల్ రాజు పెట్టిన ఖర్చులు రాబట్టారో లేదో... ఈ జిమ్మిక్కులతో ఆడియన్స్ థియేటర్లకు పరుగు పెడుతున్నారా?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ