వారం రోజులుగా మధుర్ బండార్కర్ ‘క్యాలెండర్ గర్ల్స్’ పోస్టర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటి వరకూ ఆయన తీసిన చిత్రాలన్నిటికీ చాలా క్రేజ్ ఉంది. అందులో జస్ట్ బొమ్మల కోసం క్యాలెండర్లు ఎగబడి కొంటున్నప్పుడు ఈ కదిలే బొమ్మల్ని రెండున్నర గంటల పాటు తెరమీద చూడాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది కదా? అందుకే ఈ చిత్రం గురించి ఓ తాజా వార్త బయటికి వచ్చింది. ఆయన చిత్రంలో నగ్న సన్ని వేశాలు ఉన్నాయని, అయితే, ఆ విషయం వివాదం అవుతుందని తెలుసుకొని జాగ్రత్తగా తొలి ట్రైలర్ నుంచి కట్ చేశారని... వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
దీంతో ఈ విషయంపై మధుర్ బండార్కర్ స్వయంగా మాట్లాడాల్సి వచ్చింది. అయితే ఆయన అలాంటి సన్ని వేశాలు తన చిత్రంలో లేనే లేవని అంటున్నాడు. 'అసలు ఈ వార్తలు ఎవరు ప్రచారం చేస్తారో తెలియదనీ, సినిమా విడుదలయ్యాక విషయం మీరే తెలుసుకుంటా’రని అంటున్నాడు. ఇదే విషయాన్ని ఈ చిత్ర యూనిట్ కూడా ఖండించింది.