అబాల ‘గోపాలా’న్ని అలరించే పాట అది

December 23, 2014 | 05:07 PM | 25 Views
ప్రింట్ కామెంట్

ఈ మధ్య వచ్చే చిత్రాలలో గుర్తుంచుకోదగిన పాటలు చాలా అరుదనే చెప్పాలి. వినసోంపైన సంగీతం దానికి తగ్గట్టుగా అర్థవంతమైన లిరిక్స్ అసలు రావట్లేదనే చెప్పాలి. తీన్ మార్ బీట్లతో అర్థం పర్థం లేని, ద్వంద్వార్థలతోకూడిన పదాలతో ఇప్పుడోచ్చే పాటలు కాలం వెల్లదీస్తున్నాయి. ఇలాంటి సమయంలో యువ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఓ వినసోంపైన పాటను ప్రేక్షకులకు అందిస్తాడట. ఈ మధ్యే మనం చిత్రం ద్వారా మాంచి మెలోడీ పాటలు అందించిన అనూప్ ఇప్పుడు గోపాలగోపాల చిత్రం కోసం ప్రత్యేకంగా ఓ మెలోడీ పాటను అందించాడట. అరుంధతి చిత్రంలోని జేజేమ్మ, మిర్చి చిత్రంలోని పండగలా దిగివచ్చావు పాటలు పాడిన గాయకుడు కైలాష్ కేర్ ఈ పాటను పాడాడు. మనిషి నిత్య జీవనం ఎలా కొనసాగుతుందో వివరించే ఈ పాటలో అద్భుతమైన లిరిక్స్ కి అంతే అద్భుతంగా అనూప్ ట్యూన్ కట్టాడట. ఈ విషయాన్ని స్వయంగా కైలాష్ కేర్ వివరించటం విశేషం. ఇలాంటి పాట జీవితంలో అరుదుగా వస్తుందని, విన్న ప్రతిఒక్కరూ ఈ పాటను మెచ్చుకుని తీరతారని చెబుతున్నాడు. మరి ఆ పాట గొప్పతనమేంటో తెలుసుకోవాలంటే చిత్ర ఆడియో పంక్షన్ వరకు ఆగాల్సిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ