ఆ విషయంలో తగ్గేది లేదన్న తమన్నా

December 23, 2014 | 04:13 PM | 22 Views
ప్రింట్ కామెంట్

క్రియేటివిటి ఉన్న కృష్ణ వంశీ దర్శకత్వంలో నటించాలని ఏ హీరోయిన్ కు ఉండదు చెప్పండి. హీరోయిన్లలో దాగున్న అందాలను ప్రత్యేకంగా చూపించటంలో ఆయనకు ఎవరూ సాటిరారు. అలాంటిది మిల్కీబ్యూటీ తమన్నా కృష్ణ వంశీ దర్శకత్వంలో నటించే అవకాశాన్ని చేజేతులారా వదిలేసుకుంది. విషయమేమిటంటే ప్రకాష్ రాజ్, దిల్ రాజులు సంయుక్తంగా కృష్ణ వంశీ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించాలని ప్లాన్ వేసుకున్నారు. అయితే చిత్రాన్ని చిన్న బడ్జెట్ లోనే పూర్తిచేయాలని వారిద్దరు నిర్ణయించుకున్నారంట. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు తమన్నాను అడిగారంట. దానికి తమన్నా కోటి రూపాయలు పారితోషికం ఇస్తేనే నటిస్తానని, పైసా తక్కువైన ఒప్పుకునేది లేదని ఖరాకండిగా చెప్పేసిందంట. షాక్ తిన్న ఇద్దరు బాబులు మరో హీరోయిన్ కోసం వెతికే పనిలో పడ్డారని సమాచారం. అసలే సక్సెస్ రేట్ అంతంత మాత్రం ఉన్న తమన్నా రెమ్యునరేషన్ కోసం ఒక టాప్ డైరక్టర్ తో ఛాన్స్ ను మిస్ చేసుకోవల్సింది కాదు. ప్చ్... మిల్కీ బేబీని మిస్సయ్యాం అనుకోవటం తప్పా ఏం చేస్తాం లేండి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ