‘కిక్ 2’ విడుదల కూడా ముందుకు జరిగింది...

May 23, 2015 | 02:33 PM | 53 Views
ప్రింట్ కామెంట్
ravi_teja_kick_2_niharonline

రవి తేజ సినిమాలు బాగా కిక్ ఇస్తాయని అభిమానుల్లో ఓ అభిప్రాయం ఏర్పడిపోయింది. ఎక్కువ శాతం ఆయన సినిమాలన్నీ ఎంటర్ టైన్ మెంట్, కామెడీతో రెండున్నర గంటలు ఎంజాయ్ చేస్తున్నట్టుంటాయని ప్రేక్షకులూ ఫీల్ అవుతారు. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న కిక్-2 ఇంకా ఇంకా ఆలస్యం జరుగుతూనే వస్తోంది. ఇటీవల మే 29న రిలీజ్ అవుతోందని కూడా అనౌన్స్ చేశారు. కిక్ 2 జూన్ 12న రిలీజ్‌కు రెడీ అవుతోందని ట్రేడ్ టాక్ వినిపిస్తోంది. మేలో రిలీజ్ కావలసిన కిక్ -2ను హడావిడిగా రిలీజ్ చేయడం ఇష్టం అకే అని చెపుతున్నప్పటికీ, బడ్జెట్ తడిసి మోపెడై నిర్మాత కళ్యాణ్‌రామ్‌కు టెన్షన్ తెచ్చిందని ఇన్‌సైడ్ న్యూస్. పటాస్ హిట్‌తో రిలాక్స్ అయ్యాకే కిక్ 2 బడ్జెట్ పెంచి మరింత క్వాలిటీగా తీద్దామని భావించారట. అయితే ఈ సినిమా రూ. 35 కోట్ల వరకూ ఖర్చు చేశారనీ, అన్ని ఏరియాలు, శాటిలైట్ వగైరా కలిపితే రూ. 30 కోట్ల బిజినెస్ కూడా జరగని 'కిక్ 2'  డెఫిషిట్‌తోనే రిలీజ్ అవుతోందని టాక్. రిలీజ్‌కు ఇబ్బంది లేకున్నా బయ్యర్స్, ప్రొడ్యూసర్ సేఫ్ అవ్వాలంటే 'కిక్ 2' సూపర్ హిట్టై రూ.40 కోట్లయినా కలెక్ట్ చేయాలని ట్రేడ్ వర్గాలు లెక్కలేస్తున్నాయి. ఇక నిర్మాత కళ్యాణ్ రామ్ కూడా సేఫ్ సైడ్ అయ్యే విధంగా కిక్-2 విడుదల చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ