టాలీవుడ్ క్రేజీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో గుబురు గడ్డంతో కనిపిస్తున్నారు. ఈ గడ్డం గురించి పలువురు పలు రకాల ఊహానాలు చేస్తున్నప్పటికీ, నిజమేమిటో ఎవరికీ తెలియదు. సినీ పరిశ్రమ, సామాన్య జనంతో పాటు రాజకీయ నాయకులు కూడా పవన్ గడ్డం గురించే మాట్లాడుకోవడం ఆయనుకున్న క్రేజ్ ను తెలియజేస్తుంది. ఈ గడ్డం సినిమా కోసం అన్నట్టు కొందరు అనుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి మరొక కొత్త విషయం బయటికి వచ్చింది. విశ్వంజీ అనే స్వామీజీ ఇచ్చన సలహా మేరకే పవన్ కళ్యాణ్ గడ్డం పెంచుతున్నారని తెలుస్తోంది. పవన్ కళాయణ్ కు అత్యంత సన్నిహితుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విశ్వంజీ భక్తుడు. ‘అత్తారింటికి దారేది’ సినిమా సమయంలో విశ్వంజీ హోమం కూడా నిర్వహించారట. ఆ గురువు సలహాతోనే పవన్ దీఓ చేపట్టాడని తెలుస్తోంది. అయితే... ఈ దీక్ష చేపట్టడంలోని ఉద్దేశం గానీ, కారణాలు గానీ ఎవరికీ తెలియదు. అయినా ఈయన సింహం లాంటోడు అదీ గడ్డం గీసుకోదు.... ఈయనా అంతే....