సమ్మర్ కు విడుదల చేస్తాం అంటూ చెప్పుకొచ్చిన సినిమాలన్నీ దాదాపు సమ్మర్ లో విడుదల కాలేదనే చెప్పాలి. ఎన్నాళ్ళుగానో ఊరిస్తోన్న సినిమా రవితేజ కిక్ 2 అనే చెప్పాలి. ఈ చిత్రాన్ని జులై 3న విడుదల చేయాలని అనుకుంటున్నాడు నిర్మాత కళ్యాన్ రమ్. కానీ బయ్యర్లు ఇందుకు ససేమీరా అంటున్నారు. బాహుబలి జులై 10న వస్తుంటే ఓ వారం ముందు విడుదల చేస్తే ఏం లాభమని నిలదీస్తున్నారు. పెట్టిన డబ్బులు రికవర్ కావాలన్నా కనీసం రెండు వారాల సమయం కావాలి కాబట్టి బాహుబలికి ముందు వస్తే ఒప్పుకోమంటున్నారు. బాహుబలి వచ్చిన తర్వాత కనీసం మూడు, నాలుగు వారాల పాటు రిలీజ్ చేయడానికి థియేటర్లు దొరకని పరిస్థితి ఉంటుంది. ఇక ఈ రెండూ కాక మహేష్‌బాబు 'శ్రీమంతుడు' కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో 'కిక్ 2' రిలీజ్ చేసుకోవడానికి తగిన సమయమే దొరక్క నిర్మాత కళ్యాణ్‌రామ్ చిక్కుల్లో పడ్డాడు. రిలీజ్ టైమ్ కరెక్టుగా ప్లాన్ చేసుకున్నా... ఈ మధ్య సినిమాలు అనుకున్నట్టుగా రిలీజ్ కాకపోవడంతో... ఒకదానికొకటి విడుదల పొత్తులు కుదరక తెగ ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా ఆలోచిస్తే కిక్ 2 సినిమాకు ఆగస్టు వరకూ మోక్షం కలగనట్టే కనిపిస్తోంది.