బాహుబలి సినిమాలో ప్రధానంగా చెప్పుకునే అంశం ఒకటి ఉంది. అది కిలికి భాష. దీన్ని ప్రత్యేకంగా ఈ సినిమా కోసం కనిపెట్టారంటే... శ్చర్యంగా ఉంటుంది. గతంలో కొన్ని సినిమాల్లో ఓ గమ్మత్తైన భాషను అలీ... మాట్లాడి అందరినీ నవ్వించాడు. కానీ అప్పుడు అడిగితే ఆయన నాకు తోచింది మాట్లాడేశానన్నాడు. కానీ కిలికి భాష లిపిని ప్రత్యేకంగా కనిపెట్టారట. ప్రస్తుతం ఈ సినిమాకు పనిచేసిన నటులు, టెక్నీషియన్లతో పాటు కిలికి భాష రైటర్ కూడా ప్రపంచ వ్యాప్త గుర్తుంపును పొందాడు. వారి కష్టానికి తగ్గ ఫలితం తెరమీద చూసుకుని తెగ సంబరపడుతున్నారు. డైలాగ్ రైటర్ మదన్ కార్కేకి సైతం ఈ సినిమా టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చిపెట్టింది. మదన్ ఈ సినిమాకు తమిళ వెర్షన్ డైలాగులను అందించడమేకాక కాలకేయ పాత్రకు సంబంధించిన కిలికి బాషను కూడా రచించారు. సమాచారం పెద్ద పెద్ద తమిళ ఆఫర్లు మదన్ కు దక్కుతున్నాయట. మదన్ తమిళ ప్రముఖ పాటల రచయత వరైముత్తు కొడుకు. మదన్ ఇప్పటికే ఐ, రోబో, తుపాకీ మరియు కత్తి సినిమాలకు మాటల రచయితగా పనిచేసాడు.